#telangana #bigbreakingnews #holiday
సోమవారం కూడా సెలవు?
వర్షాలు తగ్గినా వరద నుంచి చాలా పట్టణాలు, గ్రామాలు తేరుకోవట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5వేల స్కూళ్లలోకి వరద రాగా, 3వేల స్కూళ్లలో బురద పేరుకుపోయింది. 6వేల పాఠశాలల్లో విద్యుత్ బోర్డుల్లోకి నీరు చేరింది. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో హాస్టల్ విద్యార్థులు వెంటనే రావడం కష్టమవుతుంది. మలేరియా, ఇతర వ్యాధులూ వచ్చే అవకాశం ఉండటంతో సోమవారం కూడా విద్యాసంస్థలు. పనిచేయడం కష్టమని అధికారులు భావిస్తున్నారు.
