#nagoreDargahKalifa #Nagore #nagoreDargaHistory

1.తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా నాగూర్ షరీఫ్ లో వెలసి ఉన్న ఖాదర్ వలీ దర్గా కు ఇప్పుడు నెల్లూరు నుండి వెళ్తున్నాము. ఆంధ్ర, తెలంగాణ నుండి వెళ్లాలంటే ముందు మనం చెన్నై కు వెళ్లాలి, చెన్నై నుండి రైలు మరియు బస్సు మార్గంలో దర్గాకు వెళ్ళవచ్చు. చెన్నై నుండి నాగపట్నంకు డైరెక్ట్ గా బస్సు, రైలు మార్గం ఉంది. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుండి సుమారు 600 రూపాయలతో బస్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుండి సుమారు 250 రూపాయలతో రైలులో స్లీపర్ కోచ్ లో వెళ్ళవచ్చు. ఒకవేళ కార్లో వెళ్లాలంటే చెన్నై నుండి 300 కిలోమీటర్లు ఉంటుంది.

2.ఈ ఖాదర్ వలీ స్వామివారిని, షాహుల్ హమీద్ అని మరో పేరుతో కూడా పిలుస్తారు. ఖాదర్ వలీ స్వామి వారు నాగూర్ పట్నంలో అనేక అద్భుతాలు చేసిన ఘనత పొందారు. ఆయన 16వ శతాబ్దపు హిందూ రాజు అచ్యుతప్ప నాయక్ యొక్క శారీరక బాధలను కూడా నయం చేశారు. నాగూర్ దర్గాను హిందూ, ముస్లింలు సమైక్యంగా నిర్మించారు. ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా దేశ నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఆధునిక యుగంలోనూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ దర్గా నిలుస్తుంది. ఖాదర్ వలీ స్వామివారికి క్రోధుడిగా బిరుదుంది. ఆయనకు కోపం ఎక్కువ.. మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే దర్గా ప్రాంగణంలో ఉన్న టెంకాయ చెట్టు ఉన్న టెంకాయలు ఓ వ్యక్తి నరికేస్తున్నాడు. దాన్ని గమనించిన కొందరు టెంకాయలు కొట్టొద్దు అని అతన్ని కోరగా, ఎవరైతే టెంకాయలు కొడుతున్నాడో ఆ వ్యక్తి ఏం ఆ టెంకాయలకు కొమ్ములు వచ్చాయా అంటూ చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి టెంకాయల చెట్టు కిందకు దిగి వచ్చేసరికి ఆ టెంకాయలకు కొమ్ములు వచ్చినాయి. దీంతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురైపోయాడు. అప్పటినుండి ఆ చెట్టుకు టెంకాయలను నరకడం మానేశారు. వాటికి అవే రాలి కింద పడితే, కొమ్ములు వచ్చిన టెంకాయలను దర్గాలు కొనుగోలు చేసుకుని ఇళ్ళ ముందు దిష్టి టెంకాయలుగా కట్టుకుంటారు. అదేవిధంగా గాలి సోకడం, చేతబడి ,దయ్యం పట్టడం వంటి వాటితో పాటు అనేక మానసిక రోగాలు ఈ దర్గా దర్శనంతో తొలగిపోతాయి. స్వామివారు క్రోధుడు కావడంతో దర్గా దరిదాపుల్లోకి భూత ,పేత, పిశాచాలు వచ్చేందుకు భయపడతాయి. అక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అనారోగ్యంతో ఉన్నవారు. మన శరీరంలోని ఏ భాగమైతే అనారోగ్యానికి గురై వుందో ఆ భాగానికి సంబంధించిన నమూనాలు విక్రయిస్తూ ఉంటారు. ఆ నమూనాలను కొనుగోలు చేసి హుండీలో వేస్తే ఆరోగ్యవంతులవుతారని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినవి చాలానే ఉన్నాయి..!

3. చరిత్ర ప్రకారం, 16వ శతాబ్దంలో తంజావూరు రాజుగా ఉన్న అచ్యుతప్ప నాయక్, రాజు మానసిక వ్యాధితో బాధపడుతుంటే సాధువు అయినా ఖాదర్ వలీ స్వామి వారు మహిమలతో నయం చేయడంతో వారికి పరివారంగా సుమారు 200 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆ రాజు ఇచ్చిన స్థలంలో దర్గాను నిర్మించారు. ఖాదర్ వలీ స్వామి వారు తన మరణాన్ని స్వయంగా ఊహించారని, ఆయన మరణించిన తర్వాత ఎక్కడ ఖననం చేయాలి అనే దాని గురించి దత్తపుత్రుడు అయిన యూసఫ్ కు సలహా ఇచ్చారని చెప్తుంటారు.

4.నాగపట్నంలోని ప్రసిద్ధ నాగూర్ దర్గా ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. మరియు కాంపౌండ్ వాల్‌తో చుట్టబడి ఉంది. దర్గా ప్రధాన సముదాయంలోకి ప్రవేశించడానికి ప్రతి దిశలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. నాగూర్ దర్గాలో ఐదు మినార్లు ఉన్నాయి మరియు పైన పేర్కొన్న విధంగా, తంజావూరు యొక్క గొప్ప మరాఠా పాలకుడు ప్రతాప్ సింగ్ దర్గాలో ఎత్తైన మినార్‌ను నిర్మించాడు. అత్యంత ఎత్తైన మినార్ 131 అడుగుల పొడవు, షాహుల్ హమీద్ 195వ వర్ధంతి సందర్భంగా దీనిని నిర్మించారు.

దర్గా యొక్క ప్రత్యేక లక్షణం కాంప్లెక్స్ యొక్క పశ్చిమ ముఖ ద్వారం మీద ఉన్న బంగారు పూతతో కూడిన గోపురం. గోపురం ప్రధాన ద్వారం వెలుపల ఖాదర్ వలీ స్వామి అతని కుమారుడు యూసుఫ్ మరియు అతని కోడలు యొక్క సమాధులపై ఉంచబడింది.

మిగిలిన నాలుగు మినార్లు వేర్వేరు పేర్లతో పిలువబడతాయి మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సాహిబ్ మినారా 77 అడుగుల ఎత్తు, తలైమట్టు మినారా 93.5 అడుగుల ఎత్తు, ముతుబాక్ మినారా 93.25 అడుగుల ఎత్తు, ఒట్టో మినారా 80 అడుగుల ఎత్తు. ప్రతి మినార్ బంగారు గోపురం చుట్టూ నాలుగు కార్డినల్ పాయింట్ల రూపంలో నిర్మించబడింది.పుణ్యక్షేత్రంలో సాధువు చెప్పులు భద్రపరచబడ్డాయి.

దర్గా మధ్యలో ఖాదర్ వలీ స్వామి వారి సమాధిని ఉంచారు. దానిని ఏడు ద్వారాల గుండా చేరుకోవచ్చు. వీటిలో నాలుగు తలుపులు వెండితో చేయగా, మిగిలిన మూడు బంగారంతో తయారు చేయబడ్డాయి. అప్పట్లో ఒక మసీదు కూడా నిర్మించబడింది మరియు ఈ మసీదులో రోజువారీ ప్రార్థనలు జరుగుతాయి.

5.ఈ పవిత్ర పుణ్యక్షేత్రం దాని బయటి తలుపులు ఎల్లప్పుడూ అందరికీ తెరిచి ఉంచుతుంది. అయితే దర్గా లోపలి తలుపులు ఉదయం 4:30 నుండి 7:00 గంటల వరకు తెరిచి, సాయంత్రం 6:25 నుండి 9:30 గంటల వరకు మళ్లీ తెరుస్తారు. వారంలో శుక్రవారం మాత్రమే దర్గా మధ్యాహ్నం 12 నుండి 2:30 గంటల వరకు తెరిచి ఉంటుంది.

6.దర్గా ఏడాది పొడవునా అనేక పండుగలను జరుపుకుంటుంది. వాటిలో ముఖ్యమైన పండుగ ఖాదర్ వలీ గంధం ఉత్సవం. ఈ గంధమోత్సవం 14 రోజులపాటు జరుపుకుంటారు. గంధమోత్సవం సమయంలో సంగీత వాయిద్యాలను వాయించడం మరియు స్వామివారి సుతిస్తూ పాటలను పాడడం వంటి సాధారణ పద్ధతులు ఉన్నాయి. దర్గాకు వచ్చే యాత్రికులు ముందుగా దర్గా ఆవరణంలో ఉన్న పవిత్ర కోనేరులో సరిగా గుంటలో పవిత్ర స్నానం చేసి తలనీలాలు ఇస్తారు.

36 Comments

  1. అస్సలాముఅలైకుమ్ నేను కడప జిల్లా కమలాపురం దర్గా ఎ గఫారియా నుంచీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్న మీరు కమలాపురం దర్గా కి ఓచీ వీడియో షూట్ చైలీ అని reply kosam waiting

  2. బాస్ తేట్టు సుల్తానమ్మ దర్గా గురించి వీడియో చేయండి ప్లీజ్

  3. వాళ్లు ఎన్ని మహత్యాలు చేసినా ఎన్ని అద్భుతాలు చేసినా భగవంతుడు కాలేదు తమ్ముడు భగవంతుడు ఒక్కడే వాళ్లు మనుషులే కానీ మీరే భగవంతుని చేస్తున్నారు అలా చేయడం చాలా తప్పు భగవంతునికే సరి సాటి ఎవరూ లేరు ఆయన ఒక్కడే దయ్యాలు భూతాలు పోవాలంటే దర్గాలు చుట్టూ బాబాల చుట్టూ తిరిగితే పోవురు కురాన్ లో ఆయతులు ఉన్నాయి దాన్ని చదవండి దానంతట అవే వెళ్లిపోతాయి

  4. Bayya Dada Edrush darga nadyal dist bethamcharla madal gutupalli loo vundi asa darga history uplod cheyande

  5. చస్తేనే కద దేయం అయింది మళ్ళి చచ్చిన రావు అంటున్నావు స్వామీ

  6. దయ్యాలు భూతాలు హిందూ మత గ్రంధాలు ల లో వేదాలలో ఎక్కడ లేవు ఒన్లీ దేవతలు రాక్షసులు వీటిని ముడ నమ్మకాలను అబ్రహామిక్ మతాల వాళ్ళు శైతన్,సాతాను , దెయ్యం ,భూతం అని ముఘల ల తర్వాత వినికిడి లోకి వచ్చాయి 1600 A.D లో హనుమాన్ చాలీసా లో కూడా add చేశారు "భూత ప్రేత పిశాచ రాక్షస" ఆని అది తప్ప వేరే ఎక్కడా దొరకవు ఈ పదాలు …. జై శ్రీ రామ్

Write A Comment